యంగ్ హీరోయిన్లు ఎంతమంది వస్తున్నప్పటికీ.. ‘అరుంధతి’ అనుష్క ముందు వెలవెలబోతున్నారు. ప్రముఖ ఆంగ్లదినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ విమెన్ సర్వేలో అనుష్క మొదటి స్థానంలో నిలిచింది. 34 ఏళ్ల ఈ ముదురు భామపై మనసు పారేసుకున్నారు మన తెలుగు ప్రేక్షకులు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పాఠకులు అనుష్కే నెంబర్ వన్ అని తీర్పు ఇచ్చారు. దీనిపై మీ ఫీలింగ్ ఎలా ఉందని అనుష్కను అడిగితే.. “నెంబర్ గేమ్ మీద నాకు నమ్మకం లేదు. ఇప్పటివరకూ పట్టించుకోలేదు. మన కోసం ఒకరు సర్వే నిర్వహించడం, అందులో నేను నెంబర్ వన్ రావడం ప్రత్యేకంగా ఉంది” అని చెప్పింది. వయసు పెరుగుతున్నా మీ ఆదరణ తగ్గడం లేదు. సీక్రెట్ ఏంటని ప్రశ్నించగా.. “వయసును ఎవరూ దాచలేరు. అది మన జీవితంలో ఓ భాగం. 30, 32, 34.. ఈ నెంబర్ల గురించి ఆలోచించలేదు. తెరమీద మన ముఖాన్ని అమ్మకానికి పెడుతున్నాం. అందువల్ల, నా చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటా. ఫిజిక్ మైంటైన్ చేస్తా” అని సమాధానం ఇచ్చింది.
The post అనుష్కే నెంబర్ వన్! appeared first on MaaStars.