
పవన్ ‘గబ్బర్ సింగ్’లో కమల్ హాసన్ రియల్ డాటర్ శృతి హాసన్ హీరోయిన్. పవన్ కొత్త సినిమాలో కమల్ హాసన్ రీల్ డాటర్ హీరోయిన్ అట. ఎస్.జే.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో కథానాయికగా మలయాళీ భామ పార్వతీ మీనన్ సెలెక్ట్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్. దర్శకుడు ఎస్.జే.సూర్య ఈ అమ్మాయి అయితే పవన్ అక్కన సరిగ్గా సూటవుతుందని చెప్పగా.. హీరోగారు ఒకే చేశారట.
‘ఉత్తమ విలన్’ సినిమాలో కమల్ హాసన్ కూతురిగా పార్వతీ మీనన్ నటించింది. ‘బెంగుళూరు డేస్’తో పార్వతీ పాపులర్ అయ్యింది. మలయాళం, కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన ఈ మలయాళీ భామకు తెలుగులో ఇది మొదటి సినిమా. పవన్ పక్కన మలయాళీ భామ నటించడం ఇది మూడోసారి. ‘అన్నవరం’లో అసిన్, ‘పంజా’లో అంజలీ మలయాళీ అమ్మాయిలే.
The post ‘పవన్‌కళ్యాణ్’తో కమల్ రీల్ డాటర్? appeared first on MaaStars.