మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కి సుప్రీమ్ ట్యాగ్ అంటే ఇష్టమేనట కానీ… ఇటువంటి ట్యాగ్లు మనకు మనమో లేక సినిమా యూనిట్ ఇచ్చే కన్నా తెరపై నటన చూసి అభిమానులు, వేలాదిమంది ప్రేక్షకులు ఇస్తే మరింత ఆనందంగా ఉంటుంది అంటున్నాడు. చిరంజీవికి సుప్రీమ్ హీరో అనే ట్యాగ్ ఎన్నో ఏళ్లు కథానాయకుడిగా కష్టపడితే కానీ రాలేదు. సాయికి మాత్రం నాలుగు సినిమాలతో వచ్చేసింది. అది సాయి ధరమ్ తేజ్‌కి కొంత ఆనందం కలిగించినా ఎక్కడో కొంత అసంతృప్తి కూడా ఉంది. పేరుగా అయితే ఆ ట్యాగ్ అతనికి ఇష్టంలేదట. కానీ తన మావయ్య చిరంజీవి పేరు ముందుండటం వల్ల అది సుప్రీమ్ ట్యాగ్ తనకెంతో ఇష్టమని చెబుతున్నాడు. పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తను నటించిన సుప్రీమ్ ఈ సినిమా ఈ నెల 5న విడుదలకానుంది.
మొదట దిల్ రాజు టైటిల్ చెప్పగానే సాయి కాస్త కంగారుకు గురయ్యాడట. మావయ్య చెంతకు వెళ్లి విషయం చెప్పగానే ‘కష్టపడనిదే ఏదీ దక్కదు. మా కష్టమంతా మా వెనకున్న మీ కోసమే కదా. గో హెడ్ అన్నారట చిరంజీవి. అక్కడతో మేనల్లుడిలో జోష్ పెరిగింది. మావయ్య టైటిల్, ఆయన సినిమాలో ఉన్న ‘అందం హిందోళం అధరం తాంబూలం’ పాట రీమిక్స్ చాలెంజింగ్‌గా తీసుకుని తన గత చిత్రాల కన్నా పదిరెట్లు ఎక్కువ కష్టపడి పనిచేశాడట. ఇప్పటికే మావయ్యల నటనతో పోలికలు వస్తున్నాయని, వాటిని తొలగించుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నానిని తేజ్ చెబుతున్నాడు.
శుక్రవారం చిరంజీవి 150వ సినిమా ప్రారంభం గురించి చెబుతూ ”జనరల్‌గా ఓ నిర్మాత హీరోని ఎలా ఆహ్వానిస్తారో తన తండ్రిని హీరోగా, నిర్మాతగా చరణ్ అదే రీతిలో పూజా కార్యక్రమాలకు ఆహ్వానించడం ఓ కొత్త అనుభూతిని కలిగించింది. ఆ సమయంలో మా కుటుంబ సభ్యులందరికీ ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది.
The post సుప్రీమ్ ట్యాగ్ ఇష్టమే కానీ…! appeared first on MaaStars.