మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ‘రంగస్థలం’ సినిమాలోని ప్రత్యేక గీతంలో స్టెప్పులు అదరగొట్టారని జానీ మాస్టర్ అన్నారు. పూజాహెగ్డే సినిమాలోని ప్రత్యేకగీతంలో ఆడిపాడారు. ఈ పాట చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ‘జిల్ జిల్ జిగేల్’ అని సాగే ఈ పాటకు జానీ మాస్టర్ నృత్య రీతులను సమకూర్చారు. ఈ సందర్భంగా జానీ ట్వీట్ చేశారు. చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
‘ఎప్పటిలాగే మెగా పవర్‌స్టార్ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఆయన అంకితభావం చూసి ఆశ్చర్యపోయా. ‘రంగస్థలం’ సినిమా కోసం పనిచేసే అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌కు, ప్రత్యేకించి రామ్‌చరణ్, సుకుమార్, రత్నవేలు, పూజాహెగ్డే, దర్శకత్వ బృందానికి కృతజ్ఞతలు’ అని జానీ ట్వీట్ చేశారు. ఇందులో చెర్రీ సరసన సమంత నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు
The post చెర్రీ స్టెప్పులు అదుర్స్: జానీ మాస్టర్ appeared first on MaaStars.