Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

 అనాధ బాలలే అతిధులుగా  `సత్య గ్యాంగ్’టీజర్ రిలీజ్

$
0
0

సమాజంలో అనాధలనేవారు లేకుండా చేయాలనే సందేశానికి వినోదాన్ని జోడించి రూపొందిన చిత్రం `సత్య గ్యాంగ్’. ఈ చిత్రం టీజర్ ను అనాధ బాలల సమక్షంలో వారే అతిధులుగా విడుదల చేశారు. అంతేకాదు, వారికి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు చిత్ర నిర్మాత మహేష్ ఖన్నా.

సాత్విక ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ-వ్యాపారవేత్త మహేష్ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం ‘ సత్య గ్యాంగ్’. షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ని ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేష్ ఖన్నా, దర్శకుడు ప్రభాస్, హీరో సాత్విక్ ఈశ్వర్, హీరోయిన్ అక్షిత, నియూష్, హర్షిత, ఛాయాగ్రాహకులు అడుసుమిల్లి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతోపాటు.. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తూ.. దర్శకత్వ పర్వ్యవేక్షణ చేస్తున్న మహేష్ ఖన్నా మాట్లాడుతూ.. ‘సమాజంలో అనాధలనేవారు ఉండకూడదనే సందేశానికి వినోదాన్ని మేళవించి తీస్తున్న చిత్రం ‘సత్య గ్యాంగ్’. అందుకే అనాధ బాలల చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేశాం. హీరోగా పరిచయమవుతున్న సాత్విక్ ఈశ్వర్ కి చాలా మంచి భవిష్యత్ ఉంది. త్వరలోనే ఆడియో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రభాస్ ప్రతి ఫ్రేమ్ అందంగా తీర్చి దిద్దాడు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తాం. డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల కాదు ఇలా చెబుతున్నది.. సినిమాపై మాకున్న నమ్మకం వల్ల’ అన్నారు.

మా తల్లితండ్రులు నాకు జన్మనిస్తే.. ఒక దర్శకుడిగా నాకు జన్మనిచ్చిన వ్యక్తి మహేష్ ఖన్నాగారు. సినిమా మేకింగ్ సందర్భంగా నాకు తెలియకుండా ఎప్పుడైనా అయన మనసు కష్ట పెట్టి ఉంటె మన్నించవల్సిందిగా మనవి. అడుసుమిల్లి విజయ్ కుమార్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’ అన్నారు.

`సత్య గ్యాంగ్’ వంటి మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్ టైనర్ ద్వారా పరిచయం అవ్వబోతుండడం అదృష్టంగా భావిస్తున్నామని సాత్విక్ ఈశ్వర్, ప్రత్యూష్, అక్షిత అన్నారు.

సాత్విక్ ఈశ్వర్ సరసన అక్షిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యూష్, హర్షిత, సుమన్, సుహాసిని, కాలకేయ ప్రభాకర్, షఫీ, జీవా, వినోద్, మహేష్ ఖన్నా, రాజేందర్, దిల్ రమేష్, బి.హెచ్.ఈ. ఎల్.ప్రసాద్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి కథ: సిద్ధయోగి క్రియేషన్స్, ఆర్ట్: డేవిడ్, ఎడిటర్: నందమూరి హరి, అసోసియేట్ డైరెక్టర్: నాగబాబు, కో-డైరెక్టర్స్; కొండలరావు-వి.ఎన్. రెడ్డి, ప్రొడక్షన్ మేనేజర్: మంగారావు, నిర్మాత-దర్శకత్వపర్యవేక్షణ: మహేష్ ఖన్నా, సంగీతం-దర్శకత్వం: ప్రభాస్!!

The post  అనాధ బాలలే అతిధులుగా  `సత్య గ్యాంగ్’ టీజర్ రిలీజ్ appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles