Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!

$
0
0
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే కిట్టుగాడు మాత్రం సొగ‌స‌రికి కావాల్సినంత గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ తోనే ప‌వ‌న్ క‌ల్యాణ్  త్రివిక్రమ్ కాంబినేష‌న్ లో తెరకెక్కుతోన్న సినిమాలో ఛాన్సు అందుకుంది. అటు పై బ‌న్ని స‌ర‌స‌న `నా పేరు సూర్య‌`లో అవ‌కాశం ఒడిసిప‌ట్టుకుంది. ఈరెండు సెట్స్ లో ఉండ‌గానే మ‌రో క్రేజ్ ప్రాజెక్ట్ ను సొంతం చేసుకుంది.
ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఎస్.రాధాకృష్ణ హారిక అండ్ హాసిని ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో తెర‌కెక్క‌నున్న సినిమాలో ఛాన్స్ అందుకుంద‌ని స‌మాచారం.  న‌వంబ‌ర్ 1న  ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూట్ కు వెళ్ల‌నుంది.

The post ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్! appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles