`విక్రమార్కుడు` లో టిట్లా పాత్రతో అజయ్ వెరీ ఫేమస్. ఆ సినిమా మంచి గుర్తింపునిచ్చినా అజయ్ నెగిటివ్ షెడ్ కెరీర్ అంతగా సాగలేదు. తర్వాత `ఇష్క్` లో విక్రమ్ .కె. కుమార్ నెగిటివ్ కమ్ పాజిటివ్ రోల్ చేయించాడు. అనతరం 24 లో నూ ఓ ముఖ్యమైన పాత్ర ఆఫర్ చేశాడు. అయితే మరోసారి విక్రమ్ పిలిచి మరీ అజయ్ అఖిల్ సినిమాలో అవకాశం ఇచ్చాడు.
అదీ అఖిల్ ను ఢీ కొట్టే క్యారెక్టర్ కావడం విశేషం. ఇటీవలే అఖిల్ సినిమా సెట్స్ కు వెళ్లింది. ఇందులో విలన్ పాత్ర కోసం చాలా మంది స్టార్లను పరిశీలించి చివరికి అజయ్ ను ఎంపిక చేసుకున్నారు. దీంతో ఈ మూవీ అజయ్ కెరీర్ కు మరింత ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాడు.
The post అఖిల్ ను ఢీ కొట్టేది టిట్లానే! appeared first on MaaStars.