సౌత్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన మలయాళ సూపర్‌హిట్ `రన్ బేబి రన్` తెలుగులోకి `బ్లాక్‌మనీ`. (.. అన్నీ కొత్త నోట్లే) పేరుతో నిజామ్ సమర్పణలో మాజిన్ మూవీమేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. హీరోయిన్ సోనీ చరిష్టా బిగ్ సీడిని ఆవిష్కరించారు. అనంతరం సోనీ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ -“మీడియా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. మోహన్ లాల్ కెమెరా మెన్ పాత్రలో …హీరోయిన్ జర్నలిస్ట్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో వాళ్లిద్దరికీ ఎదురైన సమస్యలను ఎలా చేధించారన్న అంశాలను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. `అంతిమ తీర్పు` సినిమాలో ఒక పాట కూడా లేకుండా పెద్ద విజయం సాధించింది. ఇందులో ఒక పాటు ఉంది. ఆ కోవలోనే ఈ సినిమా కూడా పె ద్ద విజయం సాధిస్తుంది. ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ స్ర్టెయిట్ మూవీ చూసిన ఫీల్ కల్గుతుంది. మలయాళం లో పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుంది` అని అన్నారు.
వెన్నెల కంటి మాట్లాడుతూ ,- `ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మీడియా శ్రమించి పనిచేస్తుంది. ఈ క్రమంలో ఫ్యామిలీ తో పాటు, వ్యక్తిగత ఆనందాలను కూడా కోల్పోతారు. ఇంకెన్నో సమస్యలను ఎదుర్కుంటారు. అయినా చివరికీ న్యాయం, నిబద్దతే గెలుస్తుందని చెప్పే సినిమా ఇది. సయ్యద్ మంచి ఉద్దేశంతో ఈ సినిమా చేశారు. చక్కని మాటలు, పాటలు కుదిరాయి. నా వృత్తికి పూర్తిగా న్యాయం చేసాను అనుకుంటున్నా` అని అన్నారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, – చక్కని సందేశాత్మక చిత్రమిది. సినిమా విజయం సాధించాలి. సోనీ చరిష్టా మంచి పెర్పామర్. కానీ తనకు సరైన బ్రేక్ ఇంకా రాలేదు. త్వరలోనే ఆ బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా` అని అన్నారు.
The post బ్లాక్‌మనీ` ఆడియో ఆవిష్కరణ!! appeared first on MaaStars.