కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 18వ తేదీన ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకి ఓ ప్రత్యేకత ఉందని చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలైంది. విశేషమైన స్థాయిలో అభిమానుల మనసు దోచుకుంటూ రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తిచేసిన సందర్భాన్ని హైలైట్ చేస్తూ ఈ వేడుక జరుపుదామని ఈ సినిమా టీమ్ చెప్పిందట.
ఆ ప్రతిపాదనను పవన్ సున్నితంగా తిరస్కరించాడట. ‘కాటమ రాయుడు’ సినిమానే హైలైట్ చేస్తూ, రెండు దశాబ్దాల తన నట ప్రయాణానికి సంబంధించిన విశేషాలతో ఓ ఏవీని చేయమనీ .. లేదంటే చిన్న ప్రోగ్రామ్ ఏదైనా చేయమని పవన్ చెప్పాడని అంటున్నారు. కనుక .. పవన్ 20 సంవత్సరాల కెరియర్ కి సంబంధించిన విశేషాలను ఆవిష్కరిస్తూ .. ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుందన్న మాట.
The post `కాటమరాయుడు` ఆడియోలో పవన్ పై స్పెషల్ ఏవీ appeared first on MaaStars.