మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ … అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ చిత్రాలు.. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిచేసిన తరువాత రవితేజ ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనే ఆసక్తి కలగడం సహజం. కానీ ఆయనే మెగా ఫోన్ పట్టనున్నాడనే వార్త ఒకటి వినిపిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తరువాత రవితేజ దర్శకత్వంపై దృష్టి పెట్టనున్నాడని చెప్పుకుంటున్నారు.
మొదట్లో పనిచేసింది డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోనే కావడం వలన ఆయన అలా ఆలోచించడం సహజమనే టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్త మరింత బలాన్ని పుంజుకుంది. రవితేజ పూర్తి స్థాయిలో దర్శకుడిగా మారనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై రవితేజ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
The post రాజా మెగా ఫోన్ పట్టబోతున్నాడా! appeared first on MaaStars.