గోవా భామ ఇలియానాకు టాలీవుడ్ మీద ప్రేమ పొంగుకొస్తోంది. టాలీవుడ్‌ను, హైదరాబాద్‌ను ఎప్పటికీ మరచిపోనని, మరచిపోలేనని చిలక పలుకులు పలుకుతోంది. బాలీవుడ్‌లో సినిమా అవకాశాలు రాకో లేక ఇంకేంటో కానీ టాలీవుడ్‌లో ఎవరు పిలిచినా సినిమాలు చేయడానికి సిద్ధమే అంటోంది. అంతేనా ఇక్కడివాళ్లే ఆమె అవకాశాలు ఇవ్వడం లేదని తప్పు దర్శకుల మీదే తోసేస్తోంది. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ `రుస్తోం` మాత్రమే ఆమె చేతుల్లో ఉంది. అది తప్ప మరే భాషల్లోనూ ఆమె సినిమాలు చేయడం లేదు. ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావిస్తే…\
“టాలీవుడ్ ను వదిలి వెళ్ళిపోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. `బర్ఫీ` సమయంలో నేను ఇంక టాలీవుడ్‌కు రానని అందరూ అనుకున్నట్లున్నారు. అందుకు తగ్గట్టే ఎవరూ నాకు అవకాశాలు ఇవ్వలేదు. నాకు తెలుగులో పూరి జగన్నాథ్, తివిక్రమ్ లాంటి దర్శకులతో పరిచయాలున్నాయి. అలాగని వాళ్లకు ఫోన్ చేసి మీ సినిమాలో నాకో అవకాశం ఇవ్వండి అని అడగలేను కదా. వాళ్ల సినిమాలో నేను నటిస్తే బాగుంటుంది అంటే వాళ్లే ఇస్తారు“ అని చెప్పింది ఇలియానా.
సైఫ్ అలీఖాన్‌తో చేసిన `హ్యాపీ ఎండింగ్` బాగా ఆడుతుందనే అనుకున్నా. కానీ ఎందుకో ఆడలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకొని మంచి సినిమాలు చేద్దాం అనుకున్నా. ఆ గ్యాప్ అలాగా ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది. అయితే ఇంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నానని నేను బాధ పడటం లేదు. ఎందుకంటే ఆ సమయం నా కుటుంబంతో గడిపాను. అంత అవకాశం రావడం గొప్పే కదా అంది ఇలియానా.
“హైదరాబాద్ నాకు ఇల్లు లాంటిది. ఇక్కడ ఉంటే అదో ఆనందం. దాన్ని నేను చాలా మిస్ అవుతున్నా. హైదరాబాద్ వెళ్తే బిరియానీ బాగా తినేదాన్ని అదీ మిస్ అవుతున్నా. ఇక్కడి షార్ట్ కట్‌లన్ని తెలుసు. మా డ్రైవర్‌కు నేనే చెబుతుంటా. ఇలా వెళ్లు తొంరదగా వెళ్లోచ్చని“ అంటూ హైదరాబాద్ సంగతులు చెప్పింది ఇలియానా
The post హైదరాబాద్ లో అడ్డదారులన్నీ తెలుసు appeared first on MaaStars.