తండ్రితో కలసి నటించే అవకాశం రావడం ఎవరికైనా ఆనందమే. ఇన్నాళ్లు స్ఫూర్తిగా చూసుకున్న వ్యక్తి పక్కనే నటించడమంటే ఏమంత చిన్న విషయమా. ప్రస్తుతం ఈ ఆనందంలోనే ఉంది శ్రుతి హాసన్. తండ్రి కమల్ హాసన్‌తో కలసి `శభాష్ నాయుడు`లో నటిస్తోంది శ్రుతి. ఆ పాత్ర దొరకడం విషయంలో అయితే శ్రుతి ఇంకా ఆనంద పడుతోంది. “గొప్ప పాత్రలేమన్నా గ్రాసరీ స్టోర్స్‌లో దొరుకుతాయా… వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వాటిని చూసి సంతోషించాలి“ అంటోంది. లాస్ ఏంజిల్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అక్కడి సెట్‌లో సందడి ఫొటోలను ఎప్పటికప్పుడు హాసన్ కుటుంబం సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. సెట్‌లో కమల్ హాసన్ చిన్న పిల్లాడిలా సందడి చేస్తున్నట్లు ఆ ఫొటోలు చూస్తేనే తెలుస్తోంది. కావాలంటే ఈ ఫొటో చూడండి ఎలా పోజిచ్చాడో.
శ్రుతి ఈ సినిమాతో పాటు పవన్ కల్యాణ్ సినిమా కూడా చేస్తోంది. అయితే ఈ సినిమా నుంచి శ్రుతిని తప్పించారని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. నిన్నే ఆ సినిమాకు దర్శకుడు మారాడు… హీరోయిన్ మారినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు.
The post అవేమన్నా కిరాణా కొట్లో దొరుకుతాయా? appeared first on MaaStars.