పవన్ కల్యాన్ లాంటి అగ్రహీరోని డైరెక్ట్ చేసే అవకాశం ఒక్కసారి రావడమే కష్టం. అందులోనూ ఓ డిజాస్టర్ ఇచ్చిన తర్వాత కూడా నమ్మి అవకాశం ఇవ్వడం ఇంకా కష్టం. ఎంతో మంది డైరక్టర్లు లైన్‌లో ఉన్నా ఎక్కడో తమిళ ఇండస్ట్రీ నుంచి పిలుచుకొని మరీ అవకాశం ఇచ్చాడు ఎస్.జె.సూర్యకి పవన్ కల్యాణ్. అయితే ఇప్పుడు సూర్య చేసిందేంటి… సినిమా నుంచి తప్పుకోవడం. సినిమాను ముందుకు నడిపించాల్సిన దర్శకుడే ఇలా అర్ధంతరంగా వదిలేశాడా? అని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వెనుక ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే. .. చిత్రబృందం చెబుతున్న కారణమే చూద్దాం… `ఇరైవి` విడుదలైన తర్వాత అందులోని ఎస్.జె.సూర్య నటనకు మంచి స్పందన వచ్చి నటుడిగా అవకాశాలు వస్తున్నాయట. అందుకే ఈ సినిమాను కొద్ది రోజులు ఆపి నటించి వస్తా అన్నారట. అంతా బాగానే ఉంది. ఓ దర్శకుడికి దర్శకత్వం ముఖ్యమా…. నటన ముందా అంటే దర్శకత్వమే అంటారు. అలాంటప్పుడు ఇదేంటి అనే ప్రశ్న ఎవరి మదిలో అయినా మెదులుతుంది. ఇంకా ఆలోచిస్తే…. ఇప్పుడు ఎస్.జె.సూర్య నటిస్తోంది మహేష్ – మురుగదాస్ సినిమానే. అంటే మహేష్ సినిమా కోసం పవన్ సినిమా వదులుకున్నాడన్నమాట
The post మహేష్ కోసం పవన్‌ను వదులుకున్నాడా? appeared first on MaaStars.