పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్‌సింగ్ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత పవర్‌స్టార్ అందుకున్న విజయమిది. అక్కడి నుంచి పవన్ దశ తిరిగింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా విడుదలైన ‘సర్దార్’ కాస్త నిరుత్సాహ పరచినా దాన్ని మరచిపోయేలా వెంటనే ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు పవన్. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌కి అభిమాన భక్తుడైన హరీష్‌తో మళ్లీ ఓ సినిమా చెయ్యబోతున్నాడనీ ఫిలింనగర్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇది కాంబినేషన్ నిజమైతే పవన్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ ఖాయం అంటున్నారు. ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే హీరో, దర్శకుడు ఇద్దర్లో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.
The post పవన్ ఇది నిజమేనా..! appeared first on MaaStars.