మరి కొన్ని రోజుల్లోనే సమ్మర్ సీజన్ ముగుస్తుంది. పిల్లలంతా పుస్తకాల సంచీ చేత పట్టబోతున్నారు. అడ్మిషన్స్ హడావుడి కూడా అప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది. ఆ తంటాలు ఎలాగో పెద్దవాళ్లు చూసుకొంటారు కాబట్టి పిల్లలు మాత్రం మరికొన్ని రోజులపాటు వచ్చిన సినిమాల్ని వచ్చినట్టు చూడ్డానికి సిద్ధంగానే ఉన్నారు. అందుకే నిర్మాతలు కూడా సీజన్ ముగిసేలోపే సినిమాల్ని విడుదల చేయాలనుకొంటున్నారు. చేయాల్సిన పనులు ఇంకా చాలానే పెండింగ్‌లో ఉన్నప్పటికీ రేయింబవళ్లు కష్టపడుతూ సినిమాల్ని ఓ కొలిక్కి తెస్తున్నారు. ముందుగానే రిలీజ్ డేట్స్‌ని ప్రకటించేస్తున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో బోలెడన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో సందీప్‌కిషన్ సినిమా `ఒక్క అమ్మాయి తప్ప` ఒకటి. రచయిత రాజసింహ తాడినాడ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన సినిమా ఇది. సందీప్ సరసన నిత్య నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రావడంతో సినిమాని జూన్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. ఫ్లై ఓవర్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఓ థ్రిల్లర్ సినిమా ఇది. తొలి సగభాగం లవ్‌స్టోరీగా సాగుతుంది. మలి సగభాగంలోకి వచ్చేసరికి ఊహించని మలుపులు చోటు చేసుకొంటాయట. ఈ సినిమాపై సందీప్ చాలా నమ్మకంగా ఉన్నారు. చాలా రోజులు తర్వాత నేను చేసిన ఓ వెరైటీ కథ ఇది అంటున్నాడాయన. మంచి టెక్నీషియన్లు కలిసి పనిచేసిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ కనిపిస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
The post అమ్మాయితో వచ్చేస్తానంటున్నాడు appeared first on MaaStars.