సౌత్‌లో అవార్డు వేడుకలు హోరెత్తిపోతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం … ఈ నాలుగు పరిశ్రమల్ని టార్గెట్ చేస్తూ సరికొత్త అవార్డు వేడుకలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ అంతే గ్రాండ్‌గా సక్సెసవుతున్నాయి. సైమా నాలుగేళ్ల కిందటే ప్రారంభమై ఇప్పుడు టాప్ లెవల్‌కి ఎదిగింది. ఈ ఎదుగుదల చూసి ఐఫా వంటి ప్రతిష్ఠాత్మక అవార్డు వేడుకల నిర్వాహకులు సౌత్‌ని టార్గెట్ చేశారు. అంటే ఈ అవార్డు వేడుకల రూపేణా ఓ కొత్త సాంప్రదాయం ఫిలింఇండస్ర్టీలో మొదలైనట్టే. ఈ హుషారు చూస్తుంటే ఇకముందు మరిన్ని ఫిలిం అవార్డు వేడుకలు పెరిగేందుకు ఆస్కారం ఉందని అర్థమవుతోంది.
అవార్డు వేడుకలు ఏవైనా అవి ఎంటర్‌టైన్ చేసేందుకు మాత్రమే. కామన్ జనం నుంచి సెలబ్రిటీల వరకూ పరిశ్రమలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియెన్ ఈ అవార్డు వేడుకల్ని వీక్షించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అందుకే ఈ వేడుకలు అంతే ఘనంగా సాగుతున్నాయి. ఈఏడాది సైమా అవార్డు వేడుకలు రెండు రో్జుల పాటు (జూన్ 30, జూలై 1) సింగపూర్‌లో ఘనంగా జరగనున్నాయి. కాజల్, రాశీఖన్నా, శ్రుతిహాసన్, రెజీన, రకూల్, హ్యూమా ఖురేషి (బాలీవుడ్) వంటి ప్రముఖ తారలు ఈ వేడుకల్లో పాల్గొని ప్రదర్శనలివ్వనున్నారని తెలుస్తోంది.
The post సైమా, ఐఫా .. సౌత్‌ని ఊపేస్తున్న నయా ట్రెండ్!! appeared first on MaaStars.