సుధీర్‌బాబు హిందీ సినిమా భాగీ కోసం విలన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఆ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూసే వచ్చినా సుధీర్ నటన మాత్రం అదుర్స్ అంటున్నారు. ముఖ్యంగా ఆయన కండలు చూసి బాలీవుడ్ జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. కొద్దిమందైతే హృతిక్ రోషన్ కండల్ని గుర్తుకు తెప్పించాడని కితాబునిచ్చారు. విలన్‌గా ఈ రేంజ్‌లో మన్ననలు అందుకుంటున్న సుధీర్‌కి ఉన్నట్టుండి తోటి ఓ తెలుగు హీరో కాంపిటీషన్ తగిలాడు. అతను ఎవరో కాదు… నాని. హీరోగా దూసుకెళుతున్న నాని విలన్‌గా సుధీర్‌కి కాంపిటీషన్ ఇవ్వడేమేంటి అంటారా? అది నిజం. భాగీ సినిమా విడుదలని పురస్కరించుకొని సుధీర్‌బాబు ఆదివారం సాయంత్రం ట్విట్టర్‌లో మాటామంతీ కార్యక్రమాన్ని నిర్వహించాడు. నాని లైన్లోకి వచ్చి `ఈసారి నువ్వు హీరో… నేను విలన్‌గా సినిమా చేద్దాం` అన్నాడు. అందుకు సుధీర్ స్పందిస్తూ “నువ్వు విలన్‌కి సూట్ అవ్వవు“ అనేశాడు. రజనీ స్టైల్‌లో కబాలి రా… అంటూ ఒకసారి ట్రై చేయమని కోరాడు నాని. ఈ గోలంతా ఎందుకు కానీ… విలన్ లేకుండా ఇద్దరం హీరోలుగా, లేదంటే హీరో లేకుండా ఇద్దరం విలన్లుగానైనా సినిమా చేద్దాం అని ట్వీటాడు సుధీర్‌బాబు. ఇదేదో బాగానే వుంది కదా! డైరెక్టర్లూ మరి అలాంటి కథేదైనా వుంటే వీళ్లిద్దరికీ చెప్పేయండి మరీ!!
The post సుధీర్ హీరో… నాని విలన్ appeared first on MaaStars.