యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్తగా ఓ రికార్డు క్రియేట్ చేశాడు. ఈసారి సినిమాల్లో కాదండి, కొత్త కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం భారీ అమౌంట్ చెల్లించి రికార్డు క్రియేట్ చేశాడు. నెంబర్ కోసం ఎన్టీఆర్ కట్టిన డబ్బులతో కొత్త కారు.. అదీ హోండా సిటీ(లో ఎండ్) కొనుకోవచ్చు తెలుసా. అసలు వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ కొత్త బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. ఈ కారుకి టీఎస్ 09 ఈఎల్ 9999 నెంబర్ కావాలని బిడ్ వేశారు. ఎన్టీఆర్ ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఈ నెంబర్ కావాలని బీడ్ వేశారు. దాంతో ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం అధికారులు శనివారం ఆన్ లైన్‌లో వేలం వేశారు. ఈ వేలంలో ఎన్టీఆర్ రూ.10.5 లక్షలకు పాట పాడారు. అంతకు ముందు రూ.8లక్షల కంటే ఎక్కువకు ఎవరూ పాడలేదు. రవాణాశాఖ చరిత్రలో ఎన్టీఆర్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడనమాట! బాక్సాఫీస్ కలెక్షన్స్, బండి నెంబర్.. ఎక్కడైనా ఎన్టీఆర్ రికార్డులకు సాటి లేదంటున్నారు అభిమానులు!
The post 10.5లక్షలు.. ఇదీ ఎన్టీఆర్ రికార్డు appeared first on MaaStars.