ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌పై బయ్యర్లు దాడి చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించి ఆస్తుల్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పూరి జగన్నాథ్ స్వయంగా ఫిర్యాదు చేయడంతో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లపై వివిధ సెక్షన్ల కింద నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారం ముదిరి పాకాన పడేలా కనిపిస్తోంది. రాబోయే కాలంలో పూరి సినిమాల్ని అడ్డుకుంటామని డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరిస్తున్నారు.ఈ వివాదం మొత్తానికి లోఫర్ సినిమా లాసే కారణం. వరుణ్ తేజ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లోఫర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో బయ్యర్లకి తీవ్ర నష్టాలు వచ్చాయట. వాళ్లు రాబోయే సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని ఇచ్చి నష్టాన్ని కొద్దిమేర పూడ్చాలని పూరిని డిమాండ్ చేశారట. దీనిపై పూరి ససేమిరా అనడంతో గొడవలు చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగినప్పటికీ… రాబోయే కాలంలో పూరి చేసే సినిమాలు పంపిణీ కాకుండా అడ్డుకుంటామని కొద్దిమంది పంపిణీదారులు అంటున్నారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కన్నడ, తెలుగు భాషల్లో రోగ్ అనే సినిమాని తీస్తున్నాడు.
The post పూరి సినిమాల్ని అడ్డుకుంటారట appeared first on MaaStars.