ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు చిత్రాలకు పరోక్షంగా ఫైనాన్స్ చేస్తూ, అంతకన్నా ముందే నిర్మాణ రంగంలో అడుగుపెట్టి, ఎన్నో ఏళ్లకు రెండు హిట్లు సాధించిన సంస్థ పివిపి. ఈ బ్యానర్‌లో వచ్చిన వర్ణ, సైజ్‌జీర్ సినిమాలు ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇటీవల విడుదలైన క్షణం, ఊపిరి సినిమాల విజయంతో ఈ బ్యానర్ కాస్త ఊపిరి పోసుకుంది. ప్రస్తుతం మహేష్‌బాబుతో శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా ‘బ్రహ్మూెత్సవం’ సినిమా తీస్తున్నారు. ఈ మధ్యనే ఆర్‌ఎఫ్‌సీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ సినిమా అవుట్‌పుట్ మీద నిర్మాత అంతగా సంతృప్తిగా లేరట. ఈ విషయంలో మహేష్ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నాడని వినికిడి. అయితే శ్రీకాంత్ అడ్డాల సీతమ్మవాకిట్టో సిరిమల్లె చెట్టుతో కుటుంబ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాతో మహేష్‌బాబుకి మంచి పేరే వచ్చింది. అయితే శ్రీకాంత్ బాగా తీయగలడనే నమ్మకమైతే ఉంది అందుకే సున్నితంగా కొన్ని సలహాలు అందించాడట. అయితే నిర్మాత మాత్రం తన జాగ్రత్తలో తాను ఉంటున్నాడు. సినిమా ప్రమోషన్ కోసం పలు మీడియా సంస్థల చుట్టూ తిరుగుతున్నాడని వినికివి. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
The post బ్రహ్మూెత్సవం తేడా కొడుతుందా..! appeared first on MaaStars.