Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

రిలీజ్ కి రెడీగా జయం రవి “పౌరుడు”

$
0
0

తమిళంలో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న జయం రవి కథానాయకుడిగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నిమిరిందు నిల్”. జయంరవి సరసన అమలాపాల్, రాగిణి ద్వివేది కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని “గ్రే హాక్ మీడియా” పతాకంపై వీరబ్రహ్మచారి అన్నభీమోజు సమర్పణలో, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి “పౌరుడు” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జయం రవి ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది. జె.వి.రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం, ఆద్యంతం ప్రజలను ఆలోజింపజేసే విధంగా ఉండబోతోంది. నిత్యజీవితంలో మనం చూస్తున్న లంచగొండితనం పై యుద్ధం చేసే పాత్ర లో జయం రవి నటించారు. . నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో అతిధి పాత్ర పోషించడం విశేషం.

జయం రవి, అమలాపాల్, రాగిణి ద్వివేది, సూరి, శరత్ కుమార్, నాజర్, నాని (ప్రత్యేక పాత్రలో), తంబి రామయ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, నిర్మాత: రాజశేఖర్ అన్నభీమోజు, దర్శకత్వం: సముద్రఖని.

The post రిలీజ్ కి రెడీగా జయం రవి “పౌరుడు” appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles