పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి అందరి ప్రశంసలు అందుకున్న అక్షర గురించి ప్రత్యేక పరచయం అక్కర్లేదు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం వంటి కమర్షియల్ చిత్రాలతో పాటు… బ్లాక్ బస్టర్ భాగమతి, కమర్షియల్ ఎంటర్ టైనర్స్, హైపర్, నమోవెంకటేశాయ చిత్రాల్లో తనదైన పెర్ ఫార్మెన్స్ తో… ప్రశంసలందుకుంది అక్షర. అంతే కాదు… మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా పాపులర్ అయిన రెయిన్ బో చిల్డన్స్ హాస్పిటల్ యాడ్ లో కూడా అక్షర మెరిసింది. దీంతో పాటు ఐటీసీ, ఈమగ్ ఐస్ క్రీమ్ వంటి పలు యాడ్స్ లో నటించింది. అయితే అక్షర కేవలం నటనతోనే కాదు… తన గాత్రంతోనూ మెస్మరేజ్ చేస్తోంది. ఇప్పటికే తాను పాడిన పాటలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా “అహా నా పెళ్లంట” పేరుతో చేసిన కవర్ వీడియో సాంగ్ అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ వీడియో కవర్ సాంగ్ ను మహానటి సావిత్రి జీవిత చరిత్రను బయోపిక్ చిత్రంగా రూపొందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేయడం విశేషం.
అన్నట్టు… ఈ వీడియో ఆల్బమ్ ను డైరెక్ట్ చేసింది మరెవరో కాదు… కెమెరా మెన్ గా ఎంతో పేరు సంపాదించిన మీర్. ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ… అక్షర పెర్ ఫార్మెన్స్ ను, గాయనిగా తన టాలెంట్ ను గుర్తించి తానే డైరెక్ట్ చేస్తూ ఈ ఆహా నా పెళ్లంట వీడియో సాంగ్ రూపొందించారు. ఆయన అనుకున్నట్టుగానే అక్షర తన అభినయం, గాత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ… అక్షర చేసిన అహా నా పెళ్లంట కవర్ చూశాను. చాలా క్యూట్ గా ఉంది. అక్షర ఇంత బాగా చేసిందంటే నమ్మలేక పోతున్నా. కెమెరా ముందు చాలా ఈజీగా చేసింది. తాను చాలా సినిమాల్లో నటించింది. ఆ కాన్ఫిడెంట్ తో ఈ కవర్ సాంగ్ చేసింది. అక్షరకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ వీడియో చాలా మంది చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అని అన్నారు.
సాంకేతిక నిపుణులు
కొరియోగ్రఫి – బెన్నీ మాస్టర్
సినిమాటోగ్రఫి – కె. జయ కృష్ణ
కాన్సెప్ట్ అండ్ విజువలైజేషన్ – అబిద్ భుషన్
కీ బోర్డ్ – రాకేష్
మేకప్ – రవి
ఆర్ట్ – విశ్వనాథ్
ఎడిటర్, డైరెక్టర్ – మీర్
The post నాగ్ అశ్విన్ చేతుల మీదుగా విడుదలైన అక్షర అహా నా పెళ్లంట కవర్ వీడియో సాంగ్ appeared first on MaaStars.