మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తోన్న`రంగస్థలం` తొలి పాట `ఎంత సక్కగున్నావే` సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కోటికి మందికి పైగా పాట ఎంతటి విజయాన్ని అందుకుందో అర్ధమవుతోంది. అందుకే ఈ పాటను రంగస్థలం యూనిట్ అతిలోక సుందరి శ్రీదేవికి అంకితమిచ్చారు. శ్రేదేవి వీణ వాయిస్తున్న ఫోటోను డిజైన్ చేసి యూనిట్ అభిమానాన్ని చాటుకుంది.
కాగా ఇందులో రెండవ పాటను ‘రంగా రంగస్థలానా..’ శుక్రవారం విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఆ పాట ప్రోమో కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సాంగ్ పెద్ద హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.
The post అతిలోక సుందరికి రంగస్థలం సాంగ్ అంకితం appeared first on MaaStars.