దివంగత నటి శ్రీదేవి లో మంచి నటే కాదు.. కళాకారిణి కూడా ఉంది. ఖాళీ సమయాల్లో ఆమె పెయింటింగ్‌లు వేస్తుంటారు. ఓసారి సోనమ్ నటించిన ‘సావరియా’ చిత్రంలోని ఓ ఫొటో శ్రీదేవికి బాగా నచ్చడంతో దానిని అందమైన పెయింటింగ్‌గా గీశారు. అంతేకాదు పాప్‌స్టార్ మైఖెల్ జాక్సన్ బొమ్మను కూడా శ్రీదేవి గీశారు. ఈ రెండు చిత్రపటాలను త్వరలో దుబాయ్‌లో వేలానికి పెట్టనున్నారు. శ్రీదేవి పెయింటింగ్‌లు చూసి 2010లో దుబాయ్‌కి చెందిన అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ ఆమెను సంప్రదించింది.
తన పెయింటింగ్‌లను వేలానికి పెట్టాల్సిందిగా కోరింది. కానీ అందుకు శ్రీదేవి ఒప్పుకోలేదు. వేలంలో వచ్చిన డబ్బును ఓ ఛారిటీకి విరాళంగా ఇస్తామని చెప్పడంతో తన పెయింటింగ్‌లను వేలానికి పెట్టడానికి ఒప్పుకున్నారు. తను గీసిన చిత్తరువులలో మైఖెల్ జాక్సన్‌ది చాలా ఇష్టమని ఓసారి శ్రీదేవి చెప్పారట. దాంతో ఈ ఒక్క పెయింటింగ్‌ని రూ.8 లక్షల నుంచి వేలానికి పెట్టనున్నారు.
The post దుబాయ్‌లో వేలానికి శ్రీదేవి వేసిన పెయింటింగ్ appeared first on MaaStars.