మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -సమంత జంటగా నటిస్తోన్న `రంగస్థలం` తొలి పాటను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ సాహిత్యం…దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పాట గురించి
సంచలనాల రాంగోపాల్ వర్మ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అందుకే ఇలా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపాడు.
`రంగస్థలం ట్రైలర్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఈ పాట సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. పాట రాసిన చంద్రబోస్ కు…సంగీతం అందించి దేవి శ్రీ ప్రసాద్ కు మిలియన్ చీర్స్` అని ట్వీట్ చేశాడు. సాక్ష్యాత్తు వర్మనే ఇలాంటి మాట అన్నాడంటే ఆ పాటకు మరింత మైలేజ్ రావడం ఖాయం. ఇక సినిమాపై అయితే ఇప్పటికే అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి
The post వర్మకు పిచ్చ పిచ్చగా నచ్చేసిన రంగస్థలం సాంగ్! appeared first on MaaStars.