![]()
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మళ్లీ సినిమాల జోరు పెంచుతుంది. ‘యే దిల్ హై ముష్కిల్’ తర్వాత మరో సినిమాకు కమిట్ అయింది. ప్రస్తుతం మ్యాడీ మాధవన్ హీరోగా రాకేశ్ ఓం ప్రకాశ్ దర్శకత్వంలో ‘ఫ్యానీ ఖాన్’ అనే చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఇందులో హీరోయిన్ మాధవన్‌కు జోడీగా ఐష్ ను ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
![]()
దీంతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుంది. కాగా ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది.
The post మ్యాడీ సరసన ఐశర్యారాయ్! appeared first on MaaStars.