భీమవరం టాకీస్ బ్యానర్‌పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా రూపొందనున్న కొత్త చిత్రం `బటర్ ఫ్లైస్`. కె.ఆర్.ఫణిరాజ్ దర్శకుడు. ఈ చిత్రం లో హర్షిని,రోజా భారతి,మేఘనరమి,జయ,ప్రవల్లిక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏపీ ఎఫ్‌డిసి ఛైర్మన్ అంబికా కృష్ణ క్లాప్ కొట్టారు. జీవిత రాజశేఖర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నల్లముల్లు రాధ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా…నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..“పూర్తి మహిళలతో రూపొందనున్న చిత్రమిది. మూడు సంవత్సరాలు క్రితమే ఈ కథతో, ఇలాంటి డిఫరెంట్ సినిమా చేయాలనుకున్నాం. మహిళలకు ఎదురయ్యే కష్ట నష్టాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం“ అన్నారు.
చిత్ర దర్శకుడు కె.ఆర్.ఫణి రాజ్ మాట్లాడుతూ..“ ఆంధ్రయూనివర్సిటీలో ఫిల్మ్ కోర్స్ చేశాను. 75 సంవత్సరాల సినీ చరిత్రలోనే అందరూ మహిళలతో చేస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్ర విజయానికి అందరూ సహకరించాలి“ అన్నారు.
నటి జీవిత మాట్లాడుతూ..“ మనలన్ని మనమే గౌరవించే విధంగా మహిళలు నడుచుకోవాలని తెలిపారు. ఆడవారిని అసభ్యకరంగా చూపించే చిత్రాలు తగ్గాలి. భవిష్యత్‌లో మహిళలను గౌరవించే చిత్రాలు మరిన్ని రావాలి“ అన్నారు.
ఏపీ ఎఫ్‌డిసి ఛైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ..“మహిళలను గౌరవిస్తే ఆ దేశం విజయ పధంలో దూసుకుపోతుంది. ఆడది అంటే మాతృత్వం..మృదుస్వభావానికి ప్రతీక.ఇలాంటి ఓ చిత్రం తీయడం మంచి ప్రయత్నం.గొప్ప విషయం“ అన్నారు.
హీరోయిన్ యు ఎస్ ఎ జోత్స్య్న మాట్లాడుతూ ..“ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈ చిత్ర విజయానికి అందరూ సహకరించాలి“ అన్నారు.

The post బటర్ ఫ్లైస్` సినిమా ప్రారంభం appeared first on MaaStars.