నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `పైసా వసూల్` చిత్ర యూనిట్ ఇటీవల పోర్చుగల్ షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజా షెడ్యూల్ ను జూలై 3నుంచి 28 వరకు హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.
ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అల్యుమినియం ఫ్యాక్టరీలో కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. వాటికి కొనసాగింపుగా ఈ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. దీంతో షూటింగ్ పూర్తికానుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
The post హైదరాబాద్ లో బాలయ్య వసూల్! appeared first on MaaStars.