పవర్ స్టార్ పవన్ కల్యాణ్-విక్టరీ వెంకటేష్ ‘గోపాల గోపాల’ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇరువురు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ ద్వయం మళ్లీ తెరపై కనిపంచనున్నట్లు సమాచారం. పవన్‌కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. వీరిద్దరితో కూడిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్‌వేర్ కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా సినిమా టైటిల్‌ను ఖరారు చేయలేదు.
The post పవర్ స్టార్ సినిమాలో విక్టరీ వెంకటేష్! appeared first on MaaStars.