మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -సుకుమార్ కాంబినేషన్ లో `రంగస్థలం` 1985 తూర్పు గోదావరి జిల్లా పరిసరాల్లో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో నే చెర్రీ , ధనుష్ అనే బాలుడు మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నవిషయం చెర్రీ వద్దకు రావడంతో వెంటనే స్పందించి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తున్నట్లు తెలిపారు.
తర్వాత హైదరాబాద్ లో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ధనుష్ చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతంగా తిరిగి ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతుందని తెలుసుకుని ధనుష్ తల్లిదండ్రులు చెర్రీని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో ధనుష్ ను చూసిన చెర్రీ సంతోషానికి గురయ్యారు. ధనుష్ కి చెర్రీ ఓ ముద్దు ఇచ్చి `మగధీర`లో ఓ డైలాగ్ చెప్పి సర్ ప్రెజ్ చేశాడట. హ్యాట్సాప్ చెర్రీ!
The post చెర్రీకి కృతజ్ఞతలు తెలిపిన ధనుష్ తల్లిదండ్రులు appeared first on MaaStars.