`బాహుబలి-2` ఏప్రిల్ 28న విడుదల కావడంతో చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. గోపీచంద, నిఖిల్ , అవసరాల శ్రీనివాస్, హ్యాపీ డేస్ ఫేం రాహుల్ తో పాటు పలువురు హీరోల సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే బాహుబలి-2 రిలీజ్ ఓ క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
నిఖిల్ సిద్దార్థ నటించిన ‘కేశవ’ మే 12న వస్తుండగా, గోపీచంద్ నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ మే 19న, అవసరాల శ్రీనివాస్ నటించిన బాబు బాగా బిజీ చిత్రం మే 5న రిలీజ్ కు రెడీ అయ్యాయి. దీంతో పాటు `రక్షక భటుడు’ 12
తేదిన వస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి.

The post ఇక చిన్న సినిమాల జోరు షురూ! appeared first on MaaStars.