బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సర్కార్ -3’ ప్రపంచ వ్యాప్తంగా మే 12న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సర్కార్ కథకు కొనసాగింపుగా తెరకెక్కిన సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
అయితే ఈ సినిమాని ఆస్ట్రేలియా – సిడ్నీలో ప్రీమియర్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మే 12న ఆసీస్‌లో జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వేడుకలో ‘సర్కార్-3’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రామ్ గోపాల్‌వర్మ సహా సర్కార్ 3 యూనిట్ సభ్యులంతా సిడ్నీలో జరిగే ఈ వేడుకకు హాజరుకానున్నారు.

The post అసిస్-సిడ్నీల్లో సర్కార్-3 ప్రీమియర్ షో! appeared first on MaaStars.