`బాహుబలి` ది కనుక్లూజన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తోంది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా 9 వేల థియేటర్లలలో విడుదలైన సినిమా అన్ని ఏరియాల్లో భారీ వసూళ్లను సాధిస్తోంది. ఒక్క ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ర్టాలలో నే తొలి రోజు భారీ కలెక్షన్స్ సాధించింది. నైజాం 8.70, సీడెడ్ 6.10, ఉత్తరాంద్ర 4.52, గుంటూరు6.18, ఈస్ట్ -5.39, వెస్ట్ 6.08, కృష్ణా 2.82 , నెల్లూరు 2.40 కోట్ల వసూళ్ల తో బాక్సాఫీస్ ని షేకాడించింది. ఓవరాల్ గా తొలి రోజు తెలుగు రాష్ర్టాల నుంచి 42.73 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ గలగలలాడింది. ఇదే దూకుడు కొనసాగితే 1000 కోట్ల వసూళ్లను సునాయాసంగా కొల్లగొట్టగలదు.

The post తెలుగు రాష్ర్టాల్లో `బాహుబలి`-2 వసూళ్ల సునామీ! appeared first on MaaStars.