పవర్ స్టార్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జల్సా, అత్తారింటికి వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకు ముందుగా `దేవుడే దిగివచ్చినా` అనే టైటిల్ ను యూనిట్ పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
అయితే తాజాగా మరో టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. `పరదేశ ప్రయాణం` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే టైటిల్ లో అంత కిక్ లేదు. పవర్ స్టార్ టైటిల్ అంటే వైబ్రషన్ జనించాలి. అయితే ఈ టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఇప్పటికిది ఓ రూమర్ లాంటిందే. మరి పవన్ ఎలాంటి టైటిల్ సెలక్ట్ చేస్తాడో చూద్దాం
The post పవన్ మూవీ టైటిల్ ఏంటో? appeared first on MaaStars.