ప్రత్యేక ఆంధ్రుల హక్కు. మాటిచ్చి కేంద్రం మోసం చేసింది. అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ శమర శంఖం పూరించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే జనసేనాని ధపధపాలుగా ఉద్యమాలు చేస్తున్నారు. జనవరి 26న తలపెట్టిన ఉద్యమాన్ని ఉక్కు పాదంతో తొక్కారు. కాగా ఈనెల 14న వైజాగ్ లో ఆత్మ గౌరవ దీక్ష కు దిగుతున్నారు. ఈ దీక్షలో 100 మంది జనసే సైనికులతో ప్రారంభం అవుతుంది. అనంతరం లక్షలాది జనసైన్యం తోడవుతుంది.
ఏప్రిల్ 14న విశాఖకు వెళ్దాం. మన సత్తా చూపిద్దాం. ఆవేశంతో కాదు..ఆలోచనతో ముందుకు వెళదాం. చలో వైజాగ్ అంటూ జనసేనాని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డా..బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాగాన్ని భారత పార్లమెంట్ సాక్షిగా తూట్లు పొడిచిన పాలకుల నిర్లక్ష్యానికి నిరసనగా ఏపీ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ప్రతిపత్తిని… విభజన హామీలను తక్షణం అమలు చేయాలని జనసేనాని డిమాండ్ కు దిగుతున్నారు.
The post చలో వైజాగ్… జనసేనాని `ఆత్మ గౌరవ దీక్ష`@14 appeared first on MaaStars.