ఇటీవలే క్రిష్ `గౌతమీపుత్రశాతకర్ణి` చిత్రంతో హిస్టారికల్ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం ఆయనకు మరింత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపింది. అందుకే మరోసారి హిస్టరీ కంటెంట్ తోనే ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల క్రిష్ మళ్లీ బాలీవుడ్ కు వెళ్లున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు అవి నిజమేనని తెలుస్తోంది.
బాలీవుడ్ కంగన రనౌత్ ప్రధాన పాత్రలో భారతదేశ చరిత్రలో ధీరవనితగా గు ర్తింపు ఉన్న రాణీ లక్ష్మీబాయ్ జీవిత కథను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. `మణికర్ణిక` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
The post కంగనాతో క్రిష్ `రాణీ లక్ష్మీభాయ్` appeared first on MaaStars.