కండల హీరో సల్మాన్‌ఖాన్ ఇంతకాలం హీరోగా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయించాడు. కెరీర్‌లో ఠఫ్ కాంపిటీటర్‌గా ఎదిగి సత్తా చాటాడు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ బిజినెస్‌లోకి దిగుతున్నాడు. బీయింగ్ స్మార్ట్ పేరుతో కొత్త బ్రాండ్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చైనాకి చెందిన ఓ ప్లాంట్‌ని కొనేశాడు. శాంసంగ్, మైక్రోమ్యాక్స్ లాంటి కంపెనీల నుంచి ఉద్యోగుల్ని కొనేస్తున్నాడు. అటుపై ఇప్పటికే పాపులరైన అప్పో, జియోమీ, వైవో వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలకు పోటీనిచ్చే ఫోన్లను మార్కెట్లోకి తేవాలని ప్లాన్ చేస్తున్నాడు.
సల్మాన్ కంపెనీ నుంచి తయారయ్యే ఫోన్ ఖరీదు 20 వేలు లోపే. మిడ్ రేంజ్ ఫోన్ల మార్కెట్లో హవా చాటాలన్నది సల్మాన్ ప్లాన్. అందుకోసం మందన రిటైల్ స్టోర్లతోనూ ఒప్పందం చేసుకున్నాడు. మెజారిటీ పార్ట్ హక్కుదారుగా తానే ఈ కంపెనీని నిర్వహించాలన్నది ప్లాన్. తన కుటుంబ సభ్యులు ఇందులో భాగస్వాములుగా ఉంటారు.
The post టాకాఫ్ ది టౌన్: సల్మాన్ స్మార్ట్ ఫోన్ బిజినెస్! appeared first on MaaStars.