అభిమానులతో హీరో, హీరోయిన్లకు ఇక్కట్లు సహజం. కానీ కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల విషయంలో కుర్రాళ్లు హద్దు దాటి ప్రవర్తిస్తుంటారు. అభిమానం పేరుతో ఇంకేదో చేయాలని తహతహలాడుతుంటారు. అలాంటి అనుభవమే బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కు ఎదురైంది. విద్య కథానాయికగా నటిస్తోన్న బేగమ్ జాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా అమ్మడికి చేదు అనుభవం ఎదురైంది.
కోల్ కత్తా విమానశ్రయంలో ఓ అభిమాని సెల్పీ అంటూ ఎగబడ్డాడు. సరే కదా అని విద్య ఒకే చెప్పింది. ముందు చొరవగా భుజంపై చేయి వేశాడు. అభిమానే కదా పర్వాలేదు అనుకుంది. ఆ కుర్రాడు అక్కడితే ఆగలేదు. జానడు చేయి క్రిందకు దించి విద్య వీపును రుద్దడం మొదలు పెట్టాడు. అంతే వెంటనే అమ్మడికి కోపం నషాలానికి తాకింది. బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ చెడామడా తిట్టేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట.
The post ఫ్యాన్ కు విద్య వార్నింగ్! appeared first on MaaStars.