Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

17న వస్తోన్న కామెడీ థ్రిల్లర్ ‘వజ్రాలు కావాలా నాయనా’!

$
0
0

vajralu kavala nayana

శ్రీపాద ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై కిషోర్‌ కుమార్‌ కోట నిర్మించిన చిత్రం ‘వజ్రాలు కావాలా నాయనా’. అనిల్‌ బూరగాని, నేహాదేశ్‌ పాండే, నిఖిత బిస్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించడగా పి.రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న గ్రాండ్‌గా విడుదల కు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత కిషోర్‌ కుమార్‌ కోట మాట్లాడుతూ… ‘‘కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ బ్యానర్‌ ని స్థాపించాను. అందులో భాగంగా కొంత మంది నటీనటులను , సాంకేతిక నిపుణునులను మా సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. నేను రాసుకున్న కథకు తగ్గట్లుగా నటీనటులను ఎంపిక చేశాము. నా కథకు దర్శకుడు పూర్తి న్యాయం చేశాడు. ఖర్చుకు వెనకాడకుండా అద్భుతమైన లొకేషన్స్‌లో టెక్నికల్‌ వాల్యూస్ తో సినిమాను రిచ్‌గా అన్ని వర్గా ల ప్రేక్షకులకు నచ్చే కామెడీ థ్రిల్లర్ గా రూపొందించాం. టైటిల్‌కు ఇప్పటికే మంచి క్రేజ్‌ వచ్చింది.సంగీత దర్శకుడు జాన్‌ పొట్ల ట్యూన్స్‌, సురేష్‌ గంగుల ,రవికిరణ్‌ లిరిక్స్‌ బాగా కుదరడంతో ఇటీవల మ్యాంగ్‌ మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియో సూపర్‌ హిట్టయింది. శివప్రసాద్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, పి.అమర్‌ కుమార్‌ కెమెరా వర్క్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. సెన్సార్‌ సభ్యులు సినిమా ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉందంటూ ప్రశంసించడంతో సినిమాపై మంచి నమ్మకం ఏర్పడిది. ట్రైలర్స్‌కు యూట్యూబ్‌లో మంచి కాంప్లిమెంట్స్‌ లభించాయి. డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి బిజినెస్‌పరంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అన్ని ఏరియాల్లో బిజినెస్‌ పూర్తయింది. అత్యధిక థియేటర్స్‌లో ఈ నెల 17న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
అనిల్‌ బూరగాని,నేహాదేశ్‌ పాండే, నిఖిత బిస్థ్‌,విజయ్‌ సాయి,చిట్టిబాబు,శివ,అశ్విని,కుందన, కోట కిషోర్‌ కుమార్‌,ప్రసాద్‌ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.అమర్‌ కుమార్‌,అర్ట్‌: డేవిడ్‌,కొరియోగ్రఫీ: వేణు మాస్టర్‌,సంగీతం:జాన్‌ పోట్ల,బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌: శివప్రసాద్‌,పాటలు :సురేష్‌ గంగుల ,రవికిరణ్‌,ఎడిటర్‌: రామారావు జె.పి., కథ-నిర్మాత: కిషోర్‌ కుమార్‌ కోట, కథనం- డైలాగ్స్- దర్శకత్వం: పి. రాధాక్రిష్ణ.​

The post 17న వస్తోన్న కామెడీ థ్రిల్లర్ ‘వజ్రాలు కావాలా నాయనా’! appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles