
విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2017
మాస్టార్స్.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : కె. రాఘవేంద్రరావు
నిర్మాతలు : ఏ. మహేష్ రెడ్డి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
నటీనటులు : నాగార్జున, సౌరభ్ రాజ్ జైన్, అనుష్క, ప్రగ్యా జైస్వాల్, రావు రమేష్, బ్రహ్మానందం
ముందుమాట:
నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కిన `అన్నమయ్య`, `శ్రీరామదాసు`, `శిరిడిసాయి` లాంటి భక్తిరస చిత్రాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. నటుడిగా నాగ్ లో రెండవ కోణాన్ని ఆవిష్కరించిన సినిమాలవి. ఈ నేపథ్యంలో నాగ్ నుంచి మరో భక్తి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్ లో నే ఉంటాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన `ఓం నమో వేంకటేశాయ` సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కథా కమామీషు ఏంటో ఓసారి చూద్దాం.
కథ:
రాజాస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామా ( నాగార్జున)కు చిన్నప్పటి నుంచి దేవుణ్ని చూడాలని బలంగా సంకల్పిస్తాడు. తన ఆయశాన్ని నెరవేర్చుకోవాలని ఆ వయసులోనే ఇల్లు వదిలి అనుభవాంద స్వామి ( సాయికుమార్) వద్ద శిష్యరికం చేరతాడు. అప్పటికే అనుభవాంద స్వామి వద్ద చాలా మంది పిల్లలు శిక్షణలో ఉన్నా? ఏ కుర్రాడి కోరని కోర్కెను రామ కొరతాడు. రామకు దైవం పట్లు ఉన్న ఇష్టాన్ని..ఆరాధనను గమనించిన అనుభవానంద స్వామి రామ తో కఠోర తపస్సు చేయిస్తాడు. ఏళ్ల తపస్సు ఫలితంగా రామకు ఎట్టకేలకు చిన్న పిల్లాడిలా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అవుతాడు. దైవం అని గమనించలేని రామ ఆగ్రహంతో వెళ్లిపోమ్మని శాసిస్తాడు. దీంతో రామ తిరిగి మళ్లీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోతాడు. ఆ క్రమంలో రామ, మరదలు భవాని( ప్రగ్యాజైశ్వాల్) కు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించడం.. దేవుడుని చూడాలనే తన ఆశయాన్ని మరదలకు చెప్పి మళ్లీ తిరుగు ప్రయాణం పడతాడు. ఆ తర్వాత రామా ఎదుర్కున్న ఇబ్బందులేంటి? రామా కఠోర తపస్సు ఫలించిందా? చివరికి రామ దైవభక్తిని నిరూపించుకోవడానికి చేసిన త్యాగం ఏంటి? కృష్ణమ్మ ( అనుష్క) కు, కొండపై ఉన్న ధర్మరక్షకుడు మహారాజు (సంపత్ రాజ్), గోవిందరాజులు ( రావు రమేష్) లకు ఈ కథకు సంబంధం ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
కథనం- విశ్లేషణ:
ప‌్రజలకు చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా అనేది ఇప్పుడు పూర్తిగా కమర్శియల్ అయిపోయినా నాగార్జున మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి భక్తి సినిమాలు చేస్తూ చరిత్రను యువతకు తెలిజేయజేస్తున్నారు. గతంలో ఆయన చేసిన `అన్నమయ్య`, `శ్రీరామదాసు`, సినిమాల్లో దేవుడి భక్తుడిగా నటించి సక్సెస్ అయ్యారు. టాలీవుడ్ లో ఏ హీరో చేయని అరుదైన సాహసం చేసి కమర్శియల్ గానూ సక్సెస్ సాధించారు. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతీపాత్రమైన భక్తుడు హాథీరామ్ బాబా పాత్రలో నటించి ఆ పాత్రకు నూరుశాతం న్యాయం చేశారు. చరిత్రను ఆధారంగా చేసుకుని జె.కె. భారవి కథను బాగా రాశారు ..దాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు చక్కగా డ్రెమటైజ్ చేశారు. అయితే వాస్తవాలను..సహజత్వాన్ని కోల్పోయిందన్న ఫీల్ కల్గుతుంది. దేవుడు-భక్తి అనే కాన్సెప్ట్ కాత్తదేమి కాదు. గతంలో కొన్ని సినిమాలొచ్చాయి. దీంతో ప్రధమార్థంలో చాలా సన్నివేశాలు రియల్ గా ఉన్న ఫీల్ కల్గించదు. వాటిని ఇంకా రియల్ స్టిక్ గా తీర్దిదిద్ది ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ కు ముందు 15 నిమిషాలు ముందు కథను ఆసక్తిగా మలిచారు. ఇక ద్వితియార్థం కొన్ని సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయి. నేరుగా దేవుడే భక్తుడి తో పాచికలు ఆడటం…ప్రతీ సారి దేవుడు ఓడిపోవడం.. చివరి దేవుడి ఒంటిపై ఉన్నవాటిని సైతం పందెం కట్టి ఆడటం వంటి సన్నివేశాలు బాగానే ఉన్నాయి. చిన్నప్పుడే వెంకటేశ్వర స్వామికే సర్వం సమర్పించేసిన కృష్ణమ్మ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుంది. రామ-కృష్ణమ్మల మధ్య వచ్చే సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఇక క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టు. భక్తుడిని మించిన దేవుడుండని.. వెంకటేశ్వర స్వామి..రామన్నే దేవుడిగా కొలవమని చాటి చెప్పడం..అది నచ్చక రామ తను నమ్మిన దేవుణ్నే వదిలి వెళ్లిపోవాలనుకునే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణ గా ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగానే రామా ప్రాణాలు వదలడం..ఆ సమయంలో దేవుడి పాదాలను రామ కడగటం వంటలి సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉంటుంది. ఈ కథను డాక్యుమెంటరీ లా కాకుండా ఆసక్తికరంగా మలిచిన విధానం బాగుంది.
నటీనటులు పనితీరు:
హథీరామ్ బాబు పాత్రలో నాగార్జున ఒదిగిపోయారు. దేవుడితోనే భక్తుడు పాచికలు ఆడటం.. దేవుడిని మించి ఎత్తుగడలు వేసి గెలుపు సొంతం చేసుకోవడం.. ఆ సమయంలో నాగార్జున నటన అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ సన్నివేశాలకు నాగ్ ప్రాణం పోసారు. దర్శకుడు చెప్పినట్లు నాగార్జున కాకపోతే ఈ పాత్రకు మరోకరు యాప్ట్ కావడం అసాధ్యం. వెంకటేశ్వర స్వామి పాత్రలో ( సౌరబ్ జౌన్ ) బాగా నటించారు. కృష్ణమ్మ పాత్రలో అనుష్క చక్కగా నటించింది. గపతిబాబు, ప్రగ్యాజైస్వాల్‌లాంటి నటులు తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. రావురమేష్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితర పాత్రలు వినోదాన్ని బాగానే పంచాయి.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు రాఘవేంద్రరావు ప్రతి పాత్రను బాగా డిజైన్ చేశారు. చరిత్రకు సంబంధించిన విషయాలను సేకరించినంత వరకూ బాగానే చూపించారు. వెంకటేవ్వర స్వామికి ఇంత పరమ భక్తుడు ఉన్నాడా? అనే ఓ కొత్త విషయాన్ని తెలియజేయడంలో నూరుశాతం సక్సెస్ అయ్యారు. జె.కె. భారవి మాటలు అద్భుతంగా రాశారు. ఇలాంటి సినిమాలకు ఆయన ఎన్ సైక్లోపీడియా లాంట వారని మరోసారి నిరూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ ప్రేమ్ ను చక్కగా అందంగా చూపించారు. తిరుమల గ్రీనరీ అందాలను కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఎడిటింగ్ బాగుంది. కథకు అవసరమైనంత మేరకు గ్రాఫిక్స్ బాగున్నాయి.
చివరిగా: నాగ్-రాఘవేంద్రరరావు మార్క్ సినిమా
The post `ఓం నమో వేంకటేశాయ` మూవీ రివ్వ్యూ! appeared first on MaaStars.