ఆది `చుట్టాలబ్బాయి`గా మన ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆది కెరీర్‌లోనే ఈ సినిమా ది బెస్ట్ అన్న టాక్ నడుస్తోంది. ఇటీవలే రిలీజైన పోస్టర్లు, ట్రైలర్లకు జనాల్లో చక్కని స్పందన వచ్చింది. ఆది మునుపటి కంటే స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. అప్పియరెన్స్‌లో బ్రిలియన్సీ పెరిగిందన్న పాజిటివ్ స్పందన కనిపిస్తోంది. అలాగే టీజర్ అల్ట్రారిచ్‌గా కనిపించిందని.. రొమాంటిక్ కంటెంట్ బావుందని యూత్‌లో డిష్కసన్ సాగుతోంది.
ఇదంతా చుట్టాలబ్బాయికి కలిసొచ్చేదే. అంతేకాదు ఆది ఛామింగ్ లుక్ .. పోస్టర్స్‌లో చక్కగా ఎలివేట్ అయ్యింది. మొన్నటిరోజున శిల్పకళా వేదికలో ఆడియో సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూసి ఆది క్యూట్ అంటూ కొందరు అమ్మాయిలు ఆ ఫ్లెక్సీలతో సెల్ఫీలు దిగడం ఆడిటోరియంలో చర్చకొచ్చింది. ఇదంతా చూస్తుంటే చుట్టాలబ్బాయిగా ఆదిని వీరభద్రం బాగానే ఎలివేట్ చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. అంతకుమించి ఈ సినిమాని కొత్త నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, SRT ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లపై ఎంతో ప్యాషన్‌తో నిర్మించారనడంలో సందేహమేం లేదు. చుట్టాలబ్బాయి విజువల్ రిచ్ ఫిలింగా పాపులరైంది.
ఇప్పుడంతా ట్రెండ్ మారింది. కథ, కంటెంట్ ఉంటే పెద్ద సినిమా, చిన్న సినిమా, పెద్ద హీరో, చిన్న హీరో అనే తరతమ భేధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చుట్టాలబ్బాయికి అది కూడా పెద్ద ప్లస్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
Attachment
The post చుట్లాలబ్బాయి యమా స్మార్టుగున్నాడే! appeared first on MaaStars.