గౌరవం సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు శిరీష్ ఆ తరవాత కొత్తజంట సినిమా కూడా బాగా ఆడేసరికి కాస్త మెల్లిగానే అయినా ఆచి తూచి అడుగులు కదుపుతున్నాడు. మొదటి సినిమా కాబట్టి కాస్త సోషల్ ఇష్యూని ఎంచుకున్నా, కొత్తజంట సినిమాతో సరికొత్త పాత్రలో అలరించాడు. మరీ అల్లు అర్జున్ తరహా మాస్ పాత్రలు కాకుండా అల్లు శిరీష్ మూడోసారి కూడా యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కే మొగ్గు చూపాడు.
పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి S.S. తమన్ సంగీత దర్శకత్వం వహించాడు. చిత్రం యూనిట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రీసెంట్ గా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
‘నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే..నువ్వు కదిలిన గుర్తులు కనులను కలవక ముందే’ అంటూ సాగే ఈ పాట రిలీజయింది మొదలు మంచి రెస్పాన్స్ ని కూడగట్టుకుంటుంది. తమన్ కట్టిన ఈ ట్యూన్.. సరాసరి గుండె లోతుల్లోకి దూసుకుపోతుంది. అచ్చ తెలుగులో సాగే సాహిత్యం వినీ వినగానే మరో లోకంలో విహరింపజేస్తుంది. “శ్రీ రస్తు.. శుభమస్తు… అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే” అంటూ సాగే సాహిత్యం మంచి రిఫ్రెషింగ్ మూడ్ ని క్రియేట్ చేస్తుంది.
ఈ మధ్య ట్రెండ్ లా తయారైన మాస్ సినిమాలు… వాటికి తగ్గ సంగీతంతో మరీ పస తగ్గిపోయిన సంగీత ప్రపంచంలోకి రిలీజైన ఈ పాట మధురంగా సాగే మెలోడీతో మంచి మార్కులే వేసుకుంటుంది అకౌంట్ లో. తక్కిన పాటలు కూడా ఈ పాట లాగే ఆకట్టుకోగలిగితే శిరీష్ ఖాతాలో మ్యూజికల్ హిట్ పడినట్టే, అనుమానం లేదు.
The post అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు టైటిల్ సాంగ్ అదుర్స్ appeared first on MaaStars.