కుళాయి దగ్గర అమ్మణ్ణులు కొప్పు- కొప్పు పట్టుకుని కొట్టుకోవడం ఊళ్లలో చూస్తుంటాం. ఎండాకాలం వాటర్ ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం ఈ టైపు ఫైటింగులెన్నో కనులారా వీక్షిస్తూ ఉంటాం. కానీ వీళ్లేంట్రా? అంత పెద్ద సెలబ్రిటీలు అయ్యి ఉండీ ఇలా కొప్పు -కొప్పు పట్టుకుని సిగపట్లు పట్టేస్తున్నారు? అని షాకవ్వడం మన వంతు అవుతుంది ఈ వీడియో చూస్తే.
ఇద్దరు హీరోయిన్‌లు కొప్పులు పట్టుకుని లాక్కున్నారు. కాళ్లు పట్టుకుని గిరాటేసుకున్నారు. పైపైకి వెళ్లి ఫైటింగులు చేసుకున్నారు. పబ్లిక్‌లో ఈ షో చూసినవాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు! అయితే ఆనక ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని తెలిసి అంతే అవాక్కయ్యారు లెండి! అసలింతకీ కొట్టుకున్న ఆ ఇద్దరు భామలెవరు? జాక్వెలిన్ ఫెర్నాండేజ్, లీసా హెడెన్. ఈ భామలిద్దరూ హౌస్‌ఫుల్ -3లో అక్కీ సరసన నాయికలుగా నటించారు. ప్రమోషన్‌లో వెరైటీ కావాలని ఇలా కొప్పులు గుంజుకునే ఆట ఆడారన్నమాట! ఆ వీడియోని అక్షయ్ కుమార్ చిత్రీకరించి ట్విట్టర్‌లో పెట్టి ఉచిత ప్రచారం కొట్టేస్తున్నాడు. ఓ మైగాడ్ అక్కీ..!
The post చక్కనమ్మలు సిగపట్లు పట్టారు appeared first on MaaStars.