టాలీవుడ్‌లో 100 కోట్ల క్లబ్ హీరోగా పాపులర్ అయిన బన్నిపై ఉద్ధేశపూర్వకమైన కుట్ర జరుగుతోందా? అంటే అవుననే కొందరు ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో పవన్‌తో బన్ని ఎపిసోడ్స్ సహా పలు సంఘటనలు అందుకు కారణం అని చెబుతున్నారు. జూన్ 30, జూలై 1 తేదీల్లో సింగపూర్‌లో `సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్` (సైమా) వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ప్రభాస్ (బాహుబలి), మహేష్‌బాబు (శ్రీమంతుడు), అల్లు అర్జున్ (రుద్రమదేవి), నాని (భలే భలే మగాడివోయ్), వరుణ్‌తేజ్ (కంచె) .. ఈ నలుగురూ పోటీపడుతున్నారు. అయితే ఆన్‌లైన్ ఓటింగులో ప్రభాస్, మహేష్‌లకు 40 శాతం ఓట్లు, బన్నికి 11 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పటికీ ఓటింగ్ కొనసాగుతూనే ఉంది.
కట్ చేస్తే ఒక్కరోజులోనే బన్ని ఓట్ల శాతం భారీగా పెరిగి ప్రభాస్, మహేష్ ఓట్ల శాతాన్ని రీచ్ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందంటూ ప్రచారం సాగుతోంది. ఇలా పెరగడం వెనక ఫేక్ ఓటింగ్ ఉందని, వాటిని సైమా తొలగించిందని చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా బన్నిపై ఉద్ధేశపూర్వకంగా సాగిస్తున్న కుట్ర అని బన్ని ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న అరడజను స్టార్లలో బన్ని వేగంగా దూసుకొస్తున్నాడు కాబట్టి అతడి ఇమేజ్‌ని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందంటూ ఓ కొత్త ప్రచారం మొదలైంది. ఏది నిజం? ఏది అబద్ధం.. సైమానే తేల్చాలి మరి!
The post బన్నిపై ఇదేం కుట్ర? appeared first on MaaStars.