‘సిందూర పువ్వా తేనె చిందించ రావా…’ అంటూ సాగే పాట తెలియని వారెవ్వరూ ఉండరు. ఆ సినిమా దర్శకుడు దేవరాజు (60) కర్నూలు జిల్లా డోన్ హైవే ఓబులాపురం మిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరు నుండి హైదరాబాద్ కు బయలుదేరిన ఆయన ఓబులాపురం మిట్ట హైవే వద్ద కారు ప్రమాదానికి గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దేవరాజు మృతదేహాన్ని డోన్ ఆస్పత్రికి అక్కణ్ణించి కోయంబత్తూరుకు తరలించారు.
మూడు దశాబ్దాల పాటు దర్శకుడిగా కొనసాగిన దేవరాజు ఎన్నో మంచి చిత్రాలకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం తమిళంలో సీరియల్స్ కు దర్శకుడిగా వ్యవహరిస్తూ అభిమానులకు మరింతగా దగ్గరయ్యారు. అంతలో దేవరాజు ఇలా హఠాన్మరణం చెందడంతో తమిళ సినీలోకం శోక సంద్రంలో మునిగిపోయింది.
The post సింధూర పువ్వు దర్శకుడు మృతి appeared first on MaaStars.