యువసామ్రాట్ నాగచైతన్య, డీసెంట్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏమాయ చేసావె’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ‘ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే…’ పాటను, ‘షోకిల్లా’ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ రెండు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో పాటగా ‘చకోరి’ని మే 26న సోషల్ మీడియాలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ విడుదల చేయబోతున్నారు. అదేరోజు యువసామ్రాట్ నాగచైతన్య, రచయిత, చిత్ర సమర్పకులు కోన వెంకట్ కూడా ‘చకోరి’ పాటను ట్విట్టర్‌లో రిలీజ్ చేస్తున్నారు.
The post సాహసం శ్వాసగా సాగిపో ఆడియో రిలీజ్ appeared first on MaaStars.