తమిళం నుంచి తెలుగుకు వచ్చి రూ.15 కోట్లు వసూలు చేయడం అంటే ఆషామాషీ కాదు. అప్పట్లో రజనీకాంత్ `రోబో` ఫుల్ రన్‌లోనే 30కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మళ్లీ సూర్య నటించిన `సింగం` సిరీస్ సినిమాలు మాత్రమే సుమారు రూ.15కోట్లు పైగా వసూళ్లు చేశాయని చెప్పుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం తమిళ సినిమాల హవా బాక్సాఫీస్ వద్ద సాగలేదు.
తెలుగు హీరోలతో పోటీపడే సూర్యనే మరోసారి ఆ రికార్డును కొట్టాడు. `గజని`, యముడు సిరీస్ తర్వాత మళ్లీ ఆ రేంజులోనే హిట్ కొట్టాడిక్కడ. అది కూడా ఓ ప్రయోగాత్మక కమర్షియల్ సినిమాతో ఈ విజయం దక్కడం చెప్పుకోదగ్గది. సూర్య తాజా సినిమా `24` తెలుగులో ఘనమైన వసూళ్లు సాధించింది. ఈ మూవీ రిలీజ్ నుంచి ఇప్పటికి రూ.15 కోట్ల వసూళ్లు సాధించి, విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ పెద్ద విజయం సాధించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.మూడు పాత్రల్లో సూర్య మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్స్, విక్రమ్.కె.కుమార్ పనితనం ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించాయి.
The post మైండ్ బ్లోవింగ్ : `24` తెలుగు వసూళ్లు 15 కోట్లు appeared first on MaaStars.