పుత్రోత్సాహము ఆ పుత్రుని కనంగా రాదు. సుపుత్రుడు ఎదిగి, స్టార్ హీరో అయ్యి, 100 కోట్ల క్లబ్‌లో చేరితే అప్పుడు పుడుతుంది. బాస్ అల్లు అరవింద్ పరిస్థితి అదే ఇప్పుడు. పుత్రుడు బన్ని ఇప్పుడు టాలీవుడ్‌లో 100 కోట్ల క్లబ్ హీరో. సరైనోడు చిత్రంతో ఈ ఫీట్ సాధించాడు. ఈ శుభవేలళ మీడియాని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి పిలిచి మరీ థాంక్స్ చెప్పారు.
`ఇంత పెద్ద హిట్టుకి జనాల ఆదరణే కారణం. బన్నీకి, బోయపాటికి హిట్లెన్ని ఉన్నా .. ఈ స్థాయి హిట్టు లేదు. మౌత్‌టాక్ వల్లే ఇంత మంచి కలెక్షన్స్ వచ్చాయి. జనాలకు శిరసాభివందనాలు… అన్నారు. ఇంతకుముందు రికార్డులే చూసేవాళ్లం. ఇప్పుడు ఏ హీరో ఎన్నిసార్లు 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లారు? అన్నది చూస్తున్నాం. బన్నీ రెండోసారి 100 కోట్ల క్లబ్లో చేరాడని తెలిపారు అరవింద్. సరైనోడు సరే.. 100 కోట్ల క్లబ్‌లో వేరొకటి ఇంకేం ఉందబ్బా?
The post బన్ని 100 కోట్ల క్లబ్‌లో.. హ్యాపీస్: అరవింద్ appeared first on MaaStars.