తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్‌స్టాప్, కేరింత, మనసారా వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘పెన్సిల్’. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్ జి.హరి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై పెద్ద సక్సెస్ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 13న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హీరో, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ మాట్లాడుతూ – ”ఇటీవల విడుదలైన మా ‘పెన్సిల్’ ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే థియేటర్ ట్రైలర్‌కి కూడా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలోని అన్ని పాటల్ని శ్రీమణిగారు చాలా అద్భుతంగా రాశారు. ఇందులో ‘రెండే కళ్ళు..’ అనే పాట నాకు బాగా నచ్చింది. అన్ని పాటలూ మీకు బాగా నచ్చుతాయని ఆశిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా హరి వెంకటేశ్వర పిక్చర్స్ హరిగారు నిర్మాతగా మారుతున్నారు. నిర్మాత హరిగారికి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఈ సినిమా మీ స్కూల్ లైఫ్‌ని, మీ చిన్న నాటి మధుర స్మృతుల్ని మళ్ళీ మీ ముందుకు తెస్తుంది. మే 13న విడుదలవుతున్న ఈ చిత్రం నాకు తెలుగులో హీరోగా మంచి బ్రేక్‌నిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత, నిర్మాత జి.హరి మాట్లాడుతూ – ”యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకొని మా ‘పెన్సిల్’ చిత్రం పెద్ద హిట్‌అ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం రూపొందింది. జ.వి.ప్రకాష్‌కి హీరోగా మంచి పేరు తెచ్చే సినివమా అవుతుంది. మే 13న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారన్న నమ్మకం నాకు వుంది” అన్నారు.జి.వి.ప్రకాష్‌కుమార్, శ్రీదివ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో షరీఖ్ హాసన్, విటివి గణేష్, ఊర్వశి, టి.పి.గజేంద్రన్, అభిషేక్ శంకర్, ప్రియా మోష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, సినిమాటోగ్రఫీ: గోపీ అమర్‌నాథ్, ఎడిటింగ్: ఆంటోనీ, ఆర్ట్: రాజీవన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: శ్రీమణి, నిర్మాణ నిర్వహణ: వడ్డీ రామానుజం, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణి నాగరాజ్.
The post ‘పెన్సిల్’ హీరోగా తెలుగులో నాకు మంచి బ్రేక్ నిచ్చే సినిమా appeared first on MaaStars.