ప్రశాంత్, ప్రియాంక హీరో హీరోయిన్లుగా.. చేజర్ల ఇంద్రకుమార్ రాజు సమర్పణలో అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్‌పై శివ(అపురూప్) స్వీయ దర్శకత్వంలో 4×4 చిత్రం సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. మణిశర్మ పూజ కార్యక్రమాలు నిర్వహించగా..ముహుర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ కొట్టగా, సి.కళ్యాన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా..
చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ.. ”నలుగురు స్నేహితుల జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నాను. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం ద్వారా మా కుటుంబ సభ్యుడైన ప్రశాంత్ తో పాటు మరో ముగ్గురు కొత్త హీరోలు అలాగే నలుగురు కొత్త హీరోయిన్లను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాము. జూన్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఎడిటర్ కోలా భాస్కర్ మాట్లాడుతూ..’ఎంతో మంది కొత్త దర్శకులు వచినట్లుగానే శివ కూడా వస్తున్నాడు. అతనికి మీ ఆశీస్సులు కావాలి. ఈ 4×4 మంచి చిత్రం అవుతుంది..’ అన్నారు.
హీరో ప్రశాంత్ మాట్లాడుతూ.. ”హీరోగా ఇది నా మొదటి సినిమా. కథ నచ్చి ఒప్పుకున్నాను. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. లవ్ స్టోరీతో పాటు అన్ని అంశాలు ఉంటాయి” అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ నిహాల్ మాట్లాడుతూ.. ”సింగర్ అయిన నేను మొదటిసారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉంది. సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమం లో ధనరాజ్, వేణు, హ్యాపీ డేస్ హీరో వంశీ, రాకేశ్, జబర్దస్త్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత్, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో తాగుబోతు రమేష్, వేణు తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత పర్యవేక్షణః మణిశర్మ, సంగీతంః నిహాల్, కెమెరాః నాని చమిడి శెట్టి, కథా సహకారంః సాయి సునీల్, మాటలుః క్రాంతి సకినాల, ఫైట్స్ః దేవరాజ్, నిర్మాణంః అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః శివ(అపురూప్).
The post మణిశర్మ సంగీత పర్యవేక్షణలో 4×4 మూవీ ప్రారంభం appeared first on MaaStars.